తండ్రిని స్మరించుకున్న మెగాస్టార్ చిరంజీవి

తండ్రిని స్మరించుకున్న మెగాస్టార్ చిరంజీవి

Published on Dec 30, 2024 6:59 PM IST

మెగాస్టార్ చిరంజీవి సోమవారం రోజున తన తండ్రి కీ.శే. కొణిదెల వెంకట రావును స్మరించుకున్నారు. తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుని, ఆయన ఫోటోకు నివాళులు అర్పించారు మెగాస్టార్. ఈ మేరకు తన ఇంట్లో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, తల్లి అంజనమ్మలతో పాటు సోదరుడు నాగబాబు దంపతులు పాల్గొన్నారు. తనకు జన్మనిచ్చిన తండ్రి చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళి అర్పించారు. ‘‘జన్మనిచ్చిన మహానీయుడిని, ఆయన స్వర్గస్తులైన రోజున స్మరించుకుంటూ’’ అంటూ మెగాస్టార్ తన తండ్రిని స్మరిస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొణిదెల వెంకట రావు, అంజనమ్మ దంపతులకు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, మాధవి, విజయ దుర్గ సంతానం. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ ‘విశ్వంభర’తో మెగా ఫ్యాన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు