వైరల్ వీడియో : సిస్టర్స్ తో మెగాస్టార్ రాఖీ పండుగ సంబరాలు ….!

Published on Aug 13, 2022 1:30 am IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కొన్నాళ్ల క్రితం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఖాతాలు తెరిచి ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఇతర సినీ సంగతులతో పాటు వ్యక్తిగత విషయాలకు సంబంధించి కూడా కొన్ని పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో మంచి జోష్ ని నింపుతున్నారు.

ఇక నిన్నటి రాఖీ పండుగ సందర్భంగా తన సోదరీమణులు అయిన విజయదుర్గ, మాధవి లతో కలిసి రాఖీ కట్టించుకుని వారితో కలిసి సరదాగా మాట్లాడుతూ గడిపిన వీడియో బైట్ ని కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు. సోదర సోదరీమణులకు ప్రత్యేకంగా రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటూ తన పోస్ట్ లో తెలిపారు మెగాస్టార్. ట్రెడిషినల్ వేర్ అయిన తెల్ల పంచ, లాల్చీలో అదిరిపోయే లుక్ లో మెగాస్టార్ ని వీడియోలో చూడవచ్చు. ఇక ప్రస్తుతం చిరు, తన సోదరీమణులతో కలిసి రాఖీ కట్టించుకున్న ఈ వీడియో మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :