కిరాతకుడు రాజు ఆత్మహత్య ఘటనపై చిరు తన స్పందన.!

Published on Sep 16, 2021 2:25 pm IST


ఈ మధ్య తెలంగాణాలో జరిగినటువంటి ఆరేళ్ళ చిన్నారిపై హత్యచార దుర్ఘటనకు ఈరోజు తెర పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు అయినటువంటి రాజు ఆత్మహత్య చేసుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం కోసం తెలిసిన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరి వాడిని పట్టుకునే క్రమంలో టాలీవుడ్ సినీ తారలు కూడా పలువురు తమదైన కీలక పాత్ర పోషించారు. తమకు సాధ్యమైన మేర విషయాన్ని మరింత మందికి చేరవేసి ఆ ఘాతకుడిని పట్టుకునేందుకు దోహదపడ్డారు. అయితే ఈరోజు ఆత్మహత్య చేసుకున్న కిరాతకుడు రాజు ఘటనపై మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన స్పందనని తెలియజేసారు.

“అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు రాజు తనకు తానే శిక్షించు కోవడం బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత వూరట కలిగిస్తుంది. ఈ సంఘటనపై మీడియా, పౌరసమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు పౌరసమాజం చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా వారికి నా సహకారం వుంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగినవిధంగా ఆదుకోవాలి.” అని తన స్పందనను మెగాస్టార్ వ్యక్తం చేశారు.

మరి ప్రస్తుతం చిరు తన “ఆచార్య” కంప్లీట్ చేసే పనిలో ఉండగా దాని తర్వాత మరి రెండు బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :