గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి కలయికలో మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో సాలిడ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో శంకర్ నింపేసి తీసుకొస్తున్నారని చిత్ర యూనిట్ అంతా ఇపుడు గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా మేకర్స్ రామ్ చరణ్ పై భారీ కటౌట్ లాంచ్ ని ఏపీలో గ్రాండ్ గా చేశారు.
అయితే ఈ లాంచ్ లో దిల్ రాజు మెగాస్టార్ చిరంజీవి విషయంలో చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. చిరంజీవి గారు ఇది వరకే ఓసారి సినిమా చూసారు. ఇపుడు ఫైనల్ కట్ అయ్యాక మళ్ళీ చూడలాని ఆయనకి ఈరోజు మధ్యాహ్నం చెప్పానని. మరి తాను సినిమా చూసాక ఆయనే కాల్ చేసి సినిమా కోసం చెప్పిన రివ్యూని దిల్ రాజు ఎంతో ఎగ్జైట్ అవుతూ చెప్పారు.
మరి ఈసారి చిరు కాల్ లో ఈసారి సంక్రాంతికి మనం గట్టిగా కొట్టబోతున్నామని చెప్పారు అంటూ సినిమా తనకి ఆ రేంజ్ లో నచ్చింది అని దిల్ రాజు తెలిపారు. దీనితో మెగాస్టార్ నుంచి కూడా రివ్యూ ఓ రేంజ్ లో రావడంతో ఇపుడు మెగా ఫ్యాన్స్ లో గేమ్ ఛేంజర్ కోసం మరింత ఆసక్తి పెరిగిపోయింది. మరి ఈ జనవరి 10న వస్తున్న సినిమా ఎలా ఉంటుందో చూడాలి.