మెగాస్టార్ గర్జన.. “ఇంద్ర”తో మరోసారి ఆల్ టైం రికార్డ్

మెగాస్టార్ గర్జన.. “ఇంద్ర”తో మరోసారి ఆల్ టైం రికార్డ్

Published on Aug 23, 2024 8:00 AM IST

మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి పలు సెన్సేషనల్ హిట్ సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి మెగా ఇండస్ట్రీ హిట్ సినిమా “ఇంద్ర” కూడా ఒకటి. దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ యాక్షన్ డ్రామా గత 22 ఏళ్ళు కితం వచ్చి తెలుగు సినిమా రికార్డులు తిరగరాసింది. అలా అప్పుడు భారీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రీ రిలీజ్ కి రాగా ఇప్పుడు కూడా బాక్సాఫీస్ దగ్గర గర్జించింది.

తెలుగు రాష్ట్రాలు సహా యూఎస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాగా యూఎస్ మార్కెట్ లో ఈ చిత్రం ఇప్పుడు ఆల్ టైం రికార్డ్ కొట్టింది. అక్కడ రీ రిలీజ్ సినిమాల్లో మొదటి రోజుకి 50 వేలకి పైగా గ్రాస్ ని డాలర్లు రూపంలో అందుకోవడంతో ఇంతకు ముందు ఉన్న రికార్డులు అన్నీ మెగాస్టార్ చిరంజీవి బద్దలు కొట్టేశారు.

దీనితో అప్పుడూ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ చిత్రం మళ్లీ ఇప్పుడూ కూడా అదే తరహాలో ఇండస్ట్రీ రికార్డ్స్ షేక్ చేస్తుంది అని చెప్పాలి. ఇలా మొత్తానికి మెగాస్టార్ తనకి తానే సాటి అని మరోమారు చూపించారు అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు అలాగే వైజయంతి మూవీస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు