65 ఏళ్ల వయసులో కూడ మెగాస్టార్ సూపర్ స్పీడ్ !

Published on Jan 23, 2021 1:12 am IST

స్టార్ హీరోలు అంటే ఏడాదికి ఒకటి లేదా మహా అంటే రెండు సినిమాలు చేస్తున్నారు. ఒకరని కాదు ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్ హీరోలందరి పరిస్థితి ఇదే. దీంతో సంవత్సరంలో ఐదారు పెద్ద సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. టెక్నాలజీ ఇంత పెరిగినా సినిమాల కౌంట్ తగ్గిపోయిందని, ఒక్కొక హీరో కనీసం మూడు సినిమాలైనా చేయాలని సీనియర్ దర్శకులు, అప్పటి హీరోలు, నిర్మాతలు చెబుతుంటారు. ఈ పంథాను మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఆరంభం నుండి ఇప్పటి వరకు పాటిస్తూనే ఉన్నారు.

65 ఏళ్ల వయసులో కూడ వరుసపెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరు సైన్ చేసిన చిత్రాలు నాలుగున్నాయి. వాటిలో మొదటిది కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆచార్య’. ఇది షూటింగ్ దశలో ఉంది. ఇది పూర్తవగానే మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ చేస్తారు. సినిమా లాంచ్ అయింది కూడ. దాని తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ చేస్తారు. దాని తర్వాత బాబీ డైరెక్షన్లో ఒక సినిమా ఉంటుంది. ఈ నలుగురు దర్శకులను ఒక ఫోటోలో పెట్టి మై ఫెంటాస్టిక్ ఫోర్ అంటూ పరిచయం చేశారు చిరు. షూటింగ్లో ఉన్న సినిమా పూర్తైన తర్వాత ఏ సినిమా చేయాలనే విషయమై తర్జనభర్జన పడే కుర్ర హీరోల నడుమ ఆరు పదుల వయసులో కూడ ఇంకో రెండేళ్లకు సరిపడా సినిమాలను సెట్ చేసి పెట్టుకుని ఏం స్పీడు బాసు అనిపిస్తున్నారు చిరు.

సంబంధిత సమాచారం :