అల్లు ఫ్యామిలీ దిగేసింది..మెగాస్టార్ కూడ దిగుతున్నారట.. కానీ కొంచెం భిన్నంగా ?

Published on Oct 17, 2020 1:11 am IST


మెగాస్టార్ చిరంజీవి నటుడిగా ఎన్నో విజయాలను సాధించారు. అలాగే ఆయన కుమారుడు చరణ్ నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి విజయవంతంగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇలా సినీ పరిశ్రమలోని రెండు విభాగాల్లో దూసుకుపోతున్న చిరుకు చాలా ఏళ్ల నుండి ఫిల్మ్ స్టూడియో నిర్మించాలనే కోరిక బలంగా ఉంది. ఎప్పటికప్పుడు ఆ పని చేయాలని ఆయన పూనుకోవడం కానీ ప్లానింగ్ దశలోనే ఆగిపోవడం జరుగుతూ వచ్చాయి. అందుకే ఈసారి మాత్రం పక్కాగా ప్రణాళిక వేసుకుని చిరు రంగంలోకి దిగుతున్నారట.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో పది ఎకరాల విస్తీర్ణంలో స్టూడియో కట్టాలని చిరు డిసైడ్ అయ్యారట. అయితే ఇది రెగ్యులర్ ఫిల్మ్ స్టుడియోలా ఉండదట. ఇందులో ఫ్లోర్‌లు ఉండనున్నాయు. మొత్తం నాలుగు ఫ్లోర్లు ఉంటాయట. సినిమా షూటింగ్లకు, రియాలిటీ షోలకు అనువుగా ఉండేలా సకల సౌకర్యాలతో ఈ ఫ్లోర్స్ నిర్మిస్తారట. త్వరలోనే ఈ విషయమై చిరు నుండి అఫీషియల్ ప్రకటన వస్తుందని టాక్. ఇదిలా ఉంటే ఇప్పటికే అల్లు అరవింద్ గండిపేట్ ప్రాంతంలో భారీ స్టూడియో నిర్మాణాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇది కూడ పదెకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితం కానుంది.

సంబంధిత సమాచారం :

More