మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడం తో చాలా ట్రోలింగ్లు వచ్చాయి. సినిమా పెద్ద నష్టాల్లో ముగియడంతో టీమ్ గురించి, దర్శకుడు కొరటాల శివ గురించి చాలా నెగటివ్ గానే చెప్పుకున్నారు.
ఇదే టాపిక్ పై ఈరోజు మెగాస్టార్ చిరంజీవి రెస్పాండ్ అయ్యారు. నష్టాన్ని పూడ్చుకునేందుకు తాను, తన కొడుకు చరణ్ తమ రెమ్యునరేషన్లో 80 శాతం తిరిగి ఇచ్చామని చిరంజీవి తెలిపారు. చిరు తనదైన శైలిలో కామెంట్స్ చేసారు. ఆచార్య వైఫల్యానికి పూర్తి, అందులో ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేదన్నారు. ప్రస్తుతం తన తాజా చిత్రం గాడ్ ఫాదర్ విజయంతో దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. మరిన్ని వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.