ప్రస్తుత జనరేషన్‌లో మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్‌లోని పలు కీలక వ్యవహారాలను ముందుండి నడిపిస్తున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, తెలుగు చిత్ర పరిశ్రమలో నంది అవార్డులను ఇకపై ‘గద్దర్ అవార్డ్స్’గా ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. ఈ అవార్డుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ కీలక పోస్ట్ చేశారు.
“తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని, సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ, సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులకు, ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా ‘గద్దర్ అవార్డ్స్’ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరఫున ఫిలిం ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను” అని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని,
సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ
సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు,
ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా 'గద్దర్ అవార్డ్స్'
తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని
ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున,… pic.twitter.com/vpOuec2T5H— Chiranjeevi Konidela (@KChiruTweets) July 30, 2024