ప్రేక్షకాభిమానుల ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను – మెగాస్టార్ చిరంజీవి

Published on Sep 22, 2022 9:59 pm IST


మెగాస్టార్ చిరంజీవి నేటితో తన సినీ ప్రయాణం లో 44 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకి, అభిమానులకి తను ఎంతగా ఋణ పడి పోయారో ఈ మేరకు తెలియజేశారు. మీకు తెలిసిన ఈ చిరంజీవి, చిరంజీవి గా పుట్టిన రోజు, ఈ రోజు సెప్టెంబర్ 22, 1978. ప్రాణం ఖరీదు ద్వారా ప్రాణం పోసి, ప్రాణ ప్రదం గా నా ఊపిరై, నా గుండె చప్పుడై, అన్నీ మీరే అయి 44 సంవత్సరాలు నన్ను నడిపించారు. నన్ను ఇంతగా ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల ఋణం ఈ జన్మలో తీర్చుకొలేను. ఎప్పటికీ మీ చిరంజీవి అంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్.

తన సినీ జీవితం పై చేసిన ఈ పోస్ట్ కి భారీగా లైక్స్ వస్తున్నాయి. చిరు చేసిన ఈ పోస్ట్ కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :