“కల్కి” టీమ్ కి మెగాస్టార్ చిరు అభినందనలు

పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898AD చిత్రం రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం తోలి ఆట నుండే సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ భారీ బడ్జెట్ మూవీలో దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ను చూసిన ప్రముఖులు ఇప్పటికే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పై మెగాస్టార్ చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కల్కి2898AD గురించి అద్భుతమైన నివేదికలు వినబడుతున్నాయి. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకునే, కమల్ హాసన్ వంటి స్టార్ తారాగణంతో ఇటువంటి అద్భుతమైన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ భవిష్యత్తు చిత్రాన్ని రూపొందించినందుకు, సృజనాత్మకత కి నాగ్ అశ్విన్ కి వందనాలు. ఈ ఘనత సాధించినందుకు నా అభిమాన నిర్మాత అశ్విన్ దత్ గారు, ప్యాషనేట్ మరియు కరేజియస్ స్వప్న దత్, ప్రియాంక దత్ మరియు టీమ్ మొత్తానికి హృదయపూర్వక అభినందనలు. కలలు కనండి, ఇండియా ఫ్లాగ్ ను మరింత ఎత్తుకు ఎగురవేయండి అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version