ఇంటర్వూ: మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ గా బాబీ ఎక్కువ మార్కులు సంపాదించారు

అందరికీ గుడ్ మార్నింగ్, ఈరోజు మార్నింగ్ లేవడం తోనే, హుషారైన న్యూస్ తో లేవడం స్టార్ట్ అయ్యింది. మనమందరం గర్వపడే విధంగా, ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వ పడే విధంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ నాటు నాటు ఒరిజినల్ స్కోర్ విభాగం లో ఎంఎం కీరవాణి కి రావడం అనేది అందరికీ గర్వకారణం. మరొక్కసారి ఎంఎం కీరవాణి గారికి, ఎస్ ఎస్ రాజమౌళి గారికి, దానయ్య గారికి, లిరిసిస్ట్ బోస్ గారికి, సింగర్స్ కి అభినందనలు. నటించి, డాన్స్ చేసి మెప్పించిన తారక్, రామ్ చరణ్ లకు కూడా నా అభినందనలు. నాకు ఇది చాలా ప్రౌడ్ మూమెంట్.

 

వాల్తేరు వీరయ్య అంటూ వింటేజ్ చిరు ను గుర్తు చేస్తున్నారు, మళ్ళీ ఆ యంగ్ ఏజ్ మళ్ళీ వచ్చినట్లు ఉందా?

ఆ కాన్ఫ్లిక్ట్ నాలోనే ఉంది. నాకిష్టమైన, కష్ట పడి చేసేదైనా కమర్షియల్. ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎలా అయితే స్పందిస్తారో, దాన్ని ఊహించుకొని ఇంకా బాగా చేస్తాను, వైవిద్యమైన పాత్రలు చేయాలని తపన పడతాను. అందులో భాగంగానే విశ్వనాథ, బాపూ గారితో శుభలేఖ నుండి, స్వయం కృషి, ఆపద్భాందవుడు లాంటి సినిమాలు చేసినా, మంత్రి గారి వియ్యంకుడు చేసినా. ఖైదీ చేసేప్పుడు ఎంతో తపన పడి చేశా. ఇవన్నీ నా తాపత్రయం నుండి వచ్చిన ఔట్ కమ్. అంతేకాక ఆడియెన్స్ కి ఏం కావాలి అనేది డెలివరీ చేయడం మన కర్తవ్యం అనుకొనే వాడ్ని. ప్రొడ్యూసర్లు, బయ్యర్లు బాగుండాలి అని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడ్ని.

కమ్ బ్యాక్ అనుకుంటున్న టైమ్ లో ఎప్పటి నుండో చేయాలి అనుకుంటున్న సై రా, డిఫెరెంట్ పాత్రలు, సాంగ్స్, హీరోయిన్స్ లేకుండా చేయాలి అనుకున్న దానికి గాడ్ ఫాదర్ చేయడం జరిగింది. ఇవి చేస్తున్నప్పుడు సటిస్ఫాక్షన్ ఉంటుంది. అవి కూడా గౌరవ ప్రదం గా హిట్స్ అయ్యాయి. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు అనే ప్రయత్నం లో ఈ వాల్తేరు వీరయ్య సినిమా చేశాను. ఇది 100 శాతం అందరినీ అలరిస్తుంది. వింటేజ్ చిరు ను అందరూ గుర్తు చేసుకుంటారు.

ఇందులో ఒక రౌడీ అల్లుడు, ఒక ఘరానా మొగుడు, ఒక ముఠా మేస్త్రి, అన్నయ్య లో ఎలా చేశానో, ఇవన్నీ రెకలెక్ట్ చేసుకునేలా అవకాశం ఇచ్చింది ఈ చిత్రం. మార్నింగ్ షూటింగ్ కి వెళ్ళినప్పటి నుండి వైబ్రెట్ అవుతుండేవాడు. ఇది కదా మన ఏరియా అని అనిపిస్తుంది. సినిమా చేస్తున్నంత సేపు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. షూటింగ్ లో చాలా ఎంజాయ్ చేశాను. ఇంటికి వెళ్ళాక వెళ్లి తిని, పడుకోవడం కదా అని అనిపించింది. షూటింగ్ అంటే అంత ఉత్సాహం గా వచ్చే వాడ్ని, మొత్తానికి కారణం డైరెక్టర్ బాబీ. తను నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అలా చేసేవాడని.

 

150 సినిమాలు చేశారు, ఈ మేరకు మీకున్న అనుభవం తో డైరెక్టర్ కి కన్విన్స్ చేసేప్పుడు ఎలాంటి ఫ్రీడమ్ ఇస్తారు? డైరెక్టర్ కావాల్సింది రాబట్టుకోవడానికి మీరు ఎలాంటి వాతావరణం క్రియేట్ చేసారు?

మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, నేను మానిటర్ వైపు చూసాను. ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్ ఎవరైనా షాట్ ఓకే అన్నాకే అక్కడి నుండి కదులుతాను. అప్పటి వరకూ అలానే ఉండిపోతా. నేను చేసింది నాకు తెలిసిపోతుంది. నేను నాకు ఓకే కోసం ఎదురు చూడను, వాళ్ళ ఓకే కోసం ఎదురు చూస్తాను. ఒక కొత్త యాక్టర్ ను డీల్ చేసేప్పుడు ఎంత కంఫర్ట్ ఇస్తారో అలా డీల్ చేస్తాను.

అమితాబ్ బచ్చన్ గారు ఇంకా కష్ట పడతారు. ఎంతోమందికి ఇన్స్పిరేషన్. కష్టపడకూడదు అనుకుంటే రిటైర్ అయిపోవడం బెటర్. స్టార్టింగ్ లో ఉన్న ఉత్సాహం ఇదే రోజున కూడా లేకపోతే రైటర్ అయిపోవడం కరెక్ట్ అని అంటున్నా. కష్టపడాలి. కష్టపడాలి అంటే నువ్ ఆకలితో ఉండాలి. అర్థ ఆకలి తో ఉండాలి.

 

ఇన్నేళ్ల తరువాత కూడా ఈ ఆకలి, కసి, ఇంకా ఏదో చేయాలి అని, ఆ ఎలిమెంట్ ఏంటి?

కేవలం ప్రేక్షకుల యొక్క ఆదరణ. వాళ్ళు ఆదరిస్తున్నారు కాబట్టే ఈ డ్రైవింగ్ ఫోర్స్. 250 అడుగుల నుండి బంగి జంప్ చేస్తే నాకు కాళ్ళు ఓనికాయ్. అయినా ఫ్యాన్స్ రియాక్షన్ ఊహించుకుకొని చాలా రిలాక్స్డ్ గా దూకాను.

 

రవితేజ తో మీ కంఫర్ట్ జోన్ ఎలా ఉంది?

అప్పటికి, ఇప్పటికీ ఉన్న ఇమేజ్ కి డిఫరెన్స్ ఏమీ చూపించాడు. అంతే సరదాగా, ఆరోజు ఎలా ఉన్నాడో, ఈరోజు కూడా అలానే ఉన్నాడు. అప్పటి క్రమ శిక్షణ, అదే ఆహారపు అలవాట్లు, అదే విధంగా ఉన్నాడు.

 

నిర్మాతల గురించి?

వాళ్ళ లాంటి ప్రొడ్యూసర్స్ చాలా రేర్. మిగతా వాళ్ళను తక్కువ కామెంట్స్ చేసినట్లు కాదు. లాభాపేక్ష తో కాకుండా, ఒక ప్యాషన్ తో సినిమాలు చేస్తున్నారు. నేను వార్నింగ్ చేస్తుంటా, వెనుకా ముందు చూసుకోకుండా ఖర్చు చేయడం కరెక్ట్ కాదు అని. మీలాంటి నిర్మాతలు కావాలి, ప్రొటెక్ట్ చేసుకోవడం మా బాధ్యత. డైరెక్టర్ కు అప్పటికి చెప్తూనే ఉంటా. డైరెక్టర్స్ ఎక్కువ వర్క్స్ చేస్తే నిర్మాతల కి కర్చు మిగులుతుంది. ప్రొడ్యూసర్స్ బాగుపడాలి.

 

చిరంజీవి సినిమాకి సంక్రాంతి కి వస్తుంది అంటే, థియేటర్లలో మోత ఉంటుంది. ఈ సినిమా లాస్ట్ కి ఎలా?

మా సంస్థలోనే ఈ సంక్రాంతి కి రెండు సినిమాలు అనగానే, హెల్దీ గా ఫీల్ అయ్యా.బయ్యర్లు ఇబ్బంది పడతారేమో అని, ఒక రోజు గ్యాప్ ఉంటే బావుంటుంది అని నేనే ముందు అడిగా.

 

ఈ సినిమాలో మీ షర్ట్స్ బాగున్నాయి, ట్రెండ్ అయ్యే అవకాశం ఉందా?

గ్యాంగ్ లీడర్, కొన్ని చిత్రాల్లో ఇలా వాడాను. సుస్మిత డిజైన్ చేసింది. చాలా బాగా వచ్చింది. ట్రెండ్ అవుతాయో లేదో చెప్పలేను.

 

30 ఏళ్లుగా మీ గ్రేస్, స్టైల్ మారలేదు?

ఎలాంటి టెక్నాలజీ, అడ్వాన్స్ వచ్చి నా, కంటెంట్ ను ఎక్కువగా నమ్ముకుంటా. బాబీ కూడా అంతే. అందుకే మాకు ఇద్దరికీ కుదిరింది. అవసరం మేరకు టెక్నాలజీ వాడుకోవడం సబబు. ఫ్యాన్ గా ఇష్టపడినా సరే, డైరెక్టర్ గా బాబీ ఎక్కువ మార్కులు సంపాదించారు.

నాకు ఏం కావాలి అనే దానికంటే కూడా, ఆడియెన్స్ కి ఏం కావాలి, మంచి కమర్షియల్ మూవీస్ చేయాలని ఉంది. రవితేజ పాత్ర సినిమాకి, కథ కి బాగుంటుంది అని అనిపించి తీసుకోవడం జరిగింది. కథ మాత్రం మారలేదు. ఫ్యాన్ బాయ్ కి వచ్చిన ఐడియా అయ్యి ఉండొచ్చు. అందుకే రవితేజ డైలాగ్ చెప్పిన డైలాగ్ థియేటర్ల లో బాగుంటుంది అని అనుకుంటున్నా.

 

బాబీ కథ చెప్పినప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఎంటి?

ఎమోషన్ ఎంత ఉంది అని చూశా, అది చాలా బాగుంది. ఎవరైనా కథ చెప్తుంటే అంతా వింటారు. నేను చూస్తాను.

 

శృతి హాసన్ తో మీ డాన్స్, కెమిస్ట్రీ ఎలా ఉంది?

మై ఫ్రెండ్, లెజెండ్ కమల్ హాసన్ కూతురు. డిఎన్ఏ లోనే డాన్స్ ఉంటుంది. డాన్స్ అలవోకగా చేస్తుంది.

 

మీ గత సినిమాలకు సీక్వెల్స్ చేసే ఆలోచన ఉందా?

ఎవరైనా ఆసక్తికరమైన పరిణామాలతో ముందుకు వస్తే నేను తప్పకుండా చేస్తాను. చెప్పాలంటే గాడ్‌ఫాదర్‌కి ప్రీక్వెల్ చేయాలని కూడా అనుకున్నాం మరి ఎవరైనా ప్లాన్ చేస్తారో లేదో చూడాలి.

 

ఈ ఓటిటి యుగంలో ఇతర సినిమాలను రీమేక్ చేయడంపై మీ అభిప్రాయం?

తమ అభిమాన నటుడిని ఫలానా హిట్ సినిమాలో చూడటానికే జనాలు ఇష్టపడతారని, అలాంటి సినిమాలను మన నేటివిటీకి తగ్గట్టుగా రీమేక్ చేస్తున్నామని, అందుకే గాడ్ ఫాదర్ తెలుగులో సూపర్ హిట్ అయ్యిందని అనుకుంటున్నాను.

 

దేవి శ్రీ ప్రసాద్ గురించి చెప్పండి

రవితేజ అంత ఎనర్జిటిక్. ఈ సినిమా కోసం చాలా కష్టపడి బెస్ట్ ట్యూన్స్ ఇచ్చాడు, జనాలు వాటిని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తున్నారు.

 

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్?

ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాను. నా తదుపరి ప్రాజెక్ట్‌ల వివరాలను త్వరలో తెలియజేస్తాను.

Exit mobile version