మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం కి సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నయనతార లేడీ లీడ్ రోల్ లో నటించగా, టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సత్య దేవ్ విలన్ పాత్రలో నటించడం జరిగింది.
విడుదలైన తోలి రోజు నుండి పాజిటివ్ టాక్ రావడం తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం తాజాగా 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. ఈ విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. వరల్డ్ వైడ్ గా 100 కోట్ల రూపాయలు సాధించడం పట్ల అటు చిత్ర యూనిట్, ఇటు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో నటించగా, పూరి జగన్నాథ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.