“విశ్వంభర” నుంచి పవర్ఫుల్ గా ఫస్ట్ లుక్ పోస్టర్.!

“విశ్వంభర” నుంచి పవర్ఫుల్ గా ఫస్ట్ లుక్ పోస్టర్.!

Published on Aug 22, 2024 10:16 AM IST

తెలుగు సినిమా దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ఫీస్ట్ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి నేడు బాస్ బర్త్ డే కానుకగా సాలిడ్ ట్రీట్ ని అందిస్తున్నట్టుగా బాస్ బర్త్ డే స్టార్ట్ అయ్యిన ఆగస్ట్ 22 మొదటి సెకను తోనే అనౌన్స్ చేశారు. ఇక ఫైనల్ గా ఈ ట్రీట్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఆ అప్డేట్ ని రివీల్ చేసేసారు. చిరుపై సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి.

తన వెనుక నిన్న చూపించిన ప్రీ లుక్ పోస్టర్ లో పోర్టల్ కనిపిస్తుండగా దాని ముందు త్రిశూలం పట్టుకొని మోస్ట్ పవర్ ఫుల్ గా చిరంజీవి కనిపిసరున్నారు. అలాగే ఆ త్రిశూలంతో కలిపి తన చేతుల్లో పవర్ కూడా కనిపిస్తుండడం గమనించవచ్చు. ఇలా మొత్తానికి అయితే వశిష్ట మెగా అభిమానులకి భారీ ట్రీట్ ని అందించేలా ఉన్నాడని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు