చంద్రబోస్ పై మెగాస్టార్ చిరు ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Published on Mar 30, 2023 7:04 pm IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం చిత్రం వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. బ్లాక్ బస్టర్ టాక్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇంటర్నేషనల్ అవార్డ్స్ ను గెలుపొంది, భారతదేశ సినీ పరిశ్రమ కి మరింత గొప్ప పేరును తీసుకు వచ్చింది. ఈ చిత్రం లోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడం పట్ల దేశ వ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ పాటను రాసిన లిరిసిస్ట్ చంద్రబోస్ పై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక తన సంతోషం వ్యక్తం చేశారు. 95 ఏళ్లలో ఆస్కార్ అవార్డు వేదిక పై తెలుగు పదాలతో మీరు అందించిన అద్భుతమైన అనుభూతి. మీ ద్వారా ఆ క్షణాలను పొందడం ఆనందంగా ఉంది. ఆస్కార్స్ 95కి విజయవంతమైన మార్చ్ తర్వాత ఇంటికి స్వాగతం పలుకుతున్నందుకు సంతోషం గా ఉంది.

సంబంధిత సమాచారం :