“విశ్వంభర” సెట్స్ నుంచి బాస్ లుక్స్ అదుర్స్.!

ప్రస్తుతం లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం మెగాస్టార్ నుంచి స్ట్రైట్ సినిమాగా అందులోని ఒక ఫాంటసీ వండర్ గా వస్తుండడంతో దీని పట్ల మెగా అభిమానులు ఎప్పుడూ లేని విధంగా మరోసారి ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు.

అయితే ఈ సినిమా కోసం చిరు తన వింటేజ్ లుక్ లోకి మారిన సంగతి తెలిసిందే. మరి ఈ లుక్స్ లో చాలా యంగ్ గా తాను కనిపిస్తున్నారు. ఇక తాజాగా అయితే చిరు నుంచి వచ్చిన పోస్ట్ ద్వారా డైరెక్ట్ గా సినిమా సెట్స్ నుంచే తన సరికొత్త లుక్ బయటకి వచ్చింది. మరి వీటిలో కూడా చాలా యంగ్ లుక్స్ మరియు ఛార్మ్ తో బాస్ అదరగొట్టేసారు అని చెప్పాలి.

ఇంకా తన స్టైలిష్ డ్రెస్సింగ్ కూడా అదిరింది. మొత్తానికి అయితే విశ్వంభర తో అభిమానులకి చిరు సాలిడ్ ట్రీట్ అందించనున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version