తన సినిమా విషయంలో ఆసక్తిగా మారిన మెగాస్టార్ స్టేట్మెంట్.!

తన సినిమా విషయంలో ఆసక్తిగా మారిన మెగాస్టార్ స్టేట్మెంట్.!

Published on Sep 1, 2022 9:00 AM IST

ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాగైతే కొన్ని భారీ హిట్స్.. హిట్ అంటే మామూలు హిట్ కూడా కాదు బాక్సాఫీస్ పరంగా సెన్సేషనల్ హిట్లే ఈ ఏడాది తగిలాయి. మరి అదే విధంగా ఈ తరహా హిట్ తగిలితే ఇంతే స్థాయిలో దారుణ పరాజయాలు కూడా తెలుగు ఇండస్ట్రీ చూడక తప్పలేదు.

మరి ఈ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీయేవి హీరోగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య” కూడా ఒకటి. ఈ సినిమా ఊహించని రీతిలో ప్లాప్ గా నిలిచింది. దీనితో ఈ సినిమా పరాజయంపై మెగాస్టార్ మొదటిసారి తన స్పందనను తెలిపారు.

నిన్న ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఇప్పుడు కంటెంట్ ఉంటేనే థియేటర్స్ లో జనం వస్తున్నారని ఒకవేళ లేకపోతే రెండో రోజు నుంచే జనం రారని అందుకు ఉదాహరణగా నా సినిమానే ఒకటి అని ఒక ఊహించని స్టేట్మెంట్ ని అయితే అందించారు. దీనితో ఈ మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు