మెగాస్టార్ మాస్.. “గేమ్ ఛేంజర్”ని మించి “విశ్వంభర” హవా


ప్రస్తుతం మెగా హీరోస్ నుంచి రాబోతున్న పలు భారీ చిత్రాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా “గేమ్ ఛేంజర్” అలాగే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కూడా ఒకటి. మరి ఈ సినిమాని దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు. అయితే అంతా బాగానే ఉంది కానీ రెండిటి మీద కూడా మంచి బజ్ అభిమానుల్లో ఉంది.

కానీ పాన్ ఇండియా సినిమా అయినటువంటి గేమ్ ఛేంజర్ కంటే విశ్వంభర క్రేజ్ ఎక్కువగా ఉందని చెప్పాలి. ఆల్రెడీ విశ్వంభర సినిమా వాయిదా అని తెలిసిందే. దీనికంటే ముందు గేమ్ ఛేంజర్ వస్తున్నప్పటికీ బుక్ మై షోలో అయితే గేమ్ ఛేంజర్ కంటే విశ్వంభర ఇంట్రెస్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి.

గేమ్ ఛేంజర్ కి 60 వేలకి పైగా ఇంట్రెస్ట్స్ ప్రస్తుతానికి ఉంటే.. విశ్వంభర కి ఇంట్రెస్టింగ్ గా 70 వేలకి పైగా ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. దీనితో మెగాస్టార్ మాస్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే విశ్వంభర నుంచి టీజర్ వచ్చింది కదా అంటే.. గేమ్ ఛేంజర్ నుంచి రెండు సూపర్ హిట్ సాంగ్స్ కూడా వచ్చాయి. ఇలా చూసుకున్నా మెగా ఫ్యాన్స్ లో మాత్రం విశ్వంభర మేనియా మామూలుగా లేదని చెప్పాల్సిందే.

Exit mobile version