శ్రీ విష్ణు ‘సామజవరాగమనా’ ట్రైలర్ రిలీజ్ చేయనున్న మెగాస్టార్

శ్రీ విష్ణు ‘సామజవరాగమనా’ ట్రైలర్ రిలీజ్ చేయనున్న మెగాస్టార్

Published on Jun 24, 2023 4:00 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం డిఫరెంట్ జానర్ మూవీస్ చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ కొనసాగుతున్న యువ నటుల్లో శ్రీ విష్ణు కూడా ఒకరు. ఆయన తాజాగా చేస్తున్న మూవీ సామజవరాగమనా. ఈ సినిమాని వివాహ భోజనంబు ఫేం రామ్‌ అబ్బరాజు డైరెక్ట్‌ చేస్తున్నారు. ఈ మూవీలో బిగిల్‌ ఫేమ్ రెబా మోనికా జాన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. సామజవరగమనా లో వెన్నెల కిశోర్‌, నరేశ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి హాస్య మూవీస్‌ బ్యానర్‌ పై రాజేశ్‌ దండా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై ఆడియన్స్ లో మంచి హైప్ ఏర్పరిచాయి. కాగా మ్యాటర్ ఏమిటంటే, సామజవరాగమనా థియేట్రికల్ ట్రైలర్ ని రేపు మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయనున్నారని కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి జూన్ 29న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు