మెగాస్టార్ కోసం ఫుల్ స్క్రిప్ట్ రెడీ !

Published on Oct 24, 2020 11:43 pm IST


మెగాస్టార్ చిరంజీవి వినాయక్ తో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌ లో వినాయక్ తో పాటు ఆకుల శివ, సాయి మాధవ్ బుర్రా మార్పులు చేసారు. ఇప్పటికే చిరుకి పూర్తి స్క్రిప్ట్‌ కూడా వినిపించారట. మెగాస్టార్ కి కూడా చేసిన మార్పులు బాగా నచ్చాయని.. అందుకే స్క్రిప్ట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే సాయి మాధవ్ బుర్రాతో పాటు ఆకుల శివ కూడా డైలాగ్ వెర్షన్ రాశారు. ఇక ‘లూసిఫర్’లో మంజు వార్యర్, హీరోకి చెల్లి పాత్రలో నటించింది. అయితే మంజు వార్యర్ పాత్రలోనే సుహాసిని కనిపించబోతుందట.

కాగా ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉండేలా.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించాలని వినాయక్ షాట్ మేకింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడని.. ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్న వినాయక్ ఈ సినిమాతో ఎలాగైనా ఫామ్ లోకి రావాలని పట్టుదలతో ఉన్నాడట. ఇక ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న మెగాస్టార్, ఈ సినిమా పూర్తయిన తరువాత ముందుగా తమిళ ‘వేదాళం’ రీమేక్ ను మొదలుపెడతారు. ఈ సినిమాను ఏ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రామబ్రహ్మం సుంకర సమర్పణలో అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More