పవన్ కళ్యాణ్ కోసం నా దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉంది – మెహర్ రమేష్

భోళా శంకర్‌తో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే సువర్ణావకాశం మెహర్ రమేష్‌కి వచ్చింది. కానీ ఆ ఛాన్స్‌ని సరిగ్గా ఉపయోగించుకోలేదు. విడుదల తర్వాత, మెహర్ ఎక్కడా మీడియాలో లేదా ఏ ఈవెంట్‌లలో కనిపించలేదు. తాజాగా అతను ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

అతను ఒక రోజు పవన్ కళ్యాణ్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తాను అని అన్నారు. స్క్రిప్ట్ కూడా రెడీ చేసినట్లు పేర్కొన్నారు. మెహర్ రమేష్‌కి పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నాయి. కానీ అవన్నీ పెద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. మరి ఇప్పుడు ఏ హీరో మెహెర్ రమేష్ కి డైరెక్షన్‌లో అవకాశం ఇస్తారో చూడాలి.

Exit mobile version