“మేమ్ ఫేమస్” లేటెస్ట్ వసూళ్లు ఇవే!

Published on May 31, 2023 3:02 pm IST


ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ మరియు లహరి ఫిల్మ్స్ సంయుక్తంగా మేమ్ ఫేమస్ అనే హిట్ చిత్రాన్ని అందించాయి. నూతన దర్శకుడు సుమంత్ ప్రభాస్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతను ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రేక్షకులని అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకు పోతుంది.

మంగళవారం ముగిసే నాటికి ఈ సినిమా 4.3 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. చిన్న చిత్రం అయినా, ఈ తరహా నిలకడ కొనసాగించడం పట్ల చిత్ర చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్ళను రాబట్టే అవకాశం ఉంది. ఈ చిత్రంలో సార్య, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సిరి రాసి, కిరణ్ మచ్చ, అంజి మామ, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, శివ నందన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కళ్యాణ్ నాయక్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :