సమీక్ష: మెన్ టూ – కథాంశం బాగున్నా కథకథనాలు ఆకట్టుకోవు !

సమీక్ష: మెన్ టూ – కథాంశం బాగున్నా కథకథనాలు ఆకట్టుకోవు !

Published on May 27, 2023 3:01 AM IST
Men Too Movie Review In Telugu

విడుదల తేదీ : మే 26, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, మౌర్య సిద్దవరం, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు

దర్శకులు : శ్రీకాంత్ జి రెడ్డి

నిర్మాతలు: మౌర్య సిద్దవరం

సంగీత దర్శకులు: ఎలిషా ప్రవీణ్ జి & ఓషో వెంకట్

సినిమాటోగ్రఫీ: పీసీ మౌళి

ఎడిటర్: కార్తీక్ వున్నవా

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, కౌశిక్ ఘంట‌శాల‌ ప్ర‌ధాన తారాగ‌ణంగా తెరకెక్కిన సినిమా మెన్ టూ. ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ:

 

ఆదిత్య (నరేష్ అగస్త్య), మున్నా (మౌర్య సిద్దవరం), సంజు (కౌశిక్) ముగ్గురు స్నేహితులు. అందరూ ఏదోక సమయంలో అమ్మాయిల బాధితులే. అయితే, మరో అమ్మాయి బాధితుడు హర్ష (రాహుల్) విషాదకర మరణం వీరి పై ప్రభావం చూపిస్తోంది. మెన్ టూ అంటూ ఆడవాళ్ళ బాధితుల బాధను తమదైన శైలిలో వీరంతా తెలియజేస్తారు. ఈ మధ్యలో వీరి జీవితాల్లో జరిగిన సంఘటనలు ఏమిటి?, చివరకు వీరి జీవితాలు ఎలా సాగాయి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ ‘మెన్ టూ’లో మెయిన్ కాన్సెప్ట్ తో పాటు కొన్ని కామెడీ సీన్స్ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో ప్రధానంగా ఆడవారి బాధితుల నేపథ్యం, ఆ నేపథ్యంకి సంబంధించిన ట్రాక్, అలాగే ఆ ట్రాక్ తో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి మెన్ టూ కొన్ని చోట్ల పర్వాలేదు. హీరోగా నటించిన నరేష్ అగస్త్య చాలా బాగా నటించాడు.

తన ఈజ్ యాక్టింగ్ తో అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో నరేష్ అగస్త్య ఆకట్టుకున్నాడు. మౌర్య సిద్దవరం కామెడీ టైమింగ్ చాలా బాగుంది. కౌశిక్ కూడా బాగానే ఆకట్టుకున్నాడు. బ్రహ్మాజీ తన పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. రియా సుమన్, ప్రియాంక శర్మ తమ లుక్స్ తో ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన కీలక పాత్రల్లో కనిపించిన హర్ష చెముడు, సుదర్శన్ చాలా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు శ్రీకాంత్ జి రెడ్డి రాసుకున్న కథాకథనాలలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అయింది. దీనికి తోడు సినిమాలోని కీలక సన్నివేశాలన్నీ సింపుల్ గా సాగాయి. ఏ సీన్ బలంగా ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించదు. ఇక సెకండ్ హాఫ్ లో ఒకటి రెండు సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. దీనికితోడు కథనంలో నాటకీయత ఎక్కువవడంతో సహజత్వం చాలా వరకు లోపించింది.

అలాగే ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకోవు. ముఖ్యంగా ప్లే వెరీ రొటీన్ గా సాగింది. పైగా కథకు అవసరం లేని సీన్స్ ఎక్కువైపోయాయి. కొన్ని సన్నివేశాలు అయితే ముందే అర్థం అయిపోతుంటాయి. మొత్తానికి దర్శకుడు తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద ఇంట్రస్ట్ కలిగించేలా ఎలివేట్ చేయలేకపోయారు. ఓవరాల్ గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. టెక్నీకల్ టీం విషయానికి వస్తే.. సంగీతం అందించిన ఎలిషా ప్రవీణ్ జి & ఓషో వెంకట్ లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే పీసీ మౌళి సినిమాటోగ్రఫీ బాగుంది. శశిధర్ చావలి ఎడిటింగ్ పర్వాలేదు. దర్శకుడు శ్రీకాంత్ జి రెడ్డి చాలా రొటీన్ అండ్ బోరింగ్ ట్రీట్మెంట్ తో సినిమాని నడిపాడు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూస్తే ఈ “మెన్ టూ”లో మెయిన్ పాయింట్ అండ్ కొన్ని కామెడీ సీన్స్ మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ పర్వాలేదు. కానీ, బోరింగ్ ప్లే, లాజిక్ లెస్ డ్రామా, ఇంట్రెస్ట్ కలిగించలేని సీన్స్ ఎక్కువైపోయాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ పర్వాలేదనిపించినా.. సినిమా మాత్రం కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు