ఓటిటీ రివ్యూ : ‘మిడ్‌నైట్‌ మర్డర్స్‌’ – తెలుగు డబ్ చిత్రం “ఆహా”లో ప్రసారం

Published on Feb 21, 2021 6:25 pm IST

123తెలుగు.కామ్ రేటింగ్ :  3/5

నటీనటులు: కుంచకో బోబన్‌, శ్రీనాథ్‌ బసి, షరాఫ్‌ యుద్దీన్‌, ఉన్నిమయ ప్రసాద్‌, జీనూ జెసెఫ్‌

సినిమాటోగ్రఫీ: సైజు ఖలీద్‌

ఎడిటింగ్‌: సైజు శ్రీధరన్‌

రచన, దర్శకత్వం: మిథున్‌ మ్యానువల్‌ థామస్

పలు భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలతో ఆడియెన్స్‌‌ను ఎంటర్‌టైన్ చేస్తున్న ‘ఆహా’ తాజాగా మరో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘అంజామ్‌ పథిరా’. కుంచకో బోబన్‌, మాథ్యూ థామస్‌, శ్రీనాథ్‌ బసి, ఉన్నిమయ ప్రసాద్‌, జీనూ జోసెఫ్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా గతేడాది విడుదలై అక్కడ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వేదికగా ‘మిడ్‌నైట్‌ మర్డర్స్‌’ పేరుతో ఫిబ్రవరి 19 ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్‌ అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

అన్వర్ (కుంచకో బోబన్‌) ఒక సైకాలజిస్ట్. పోలీసులకు కొన్ని స్పెషల్ కేసుల్లో హెల్ప్ చేస్తుంటాడు. అయితే ఈ క్రమంలో మిడ్ నైట్ న వరుసగా పోలీసులు హత్యకు గురవుతూ ఉంటారు. ఆ హత్యలు అతి దారుణంగా జరుగుతూ ఉండటంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుంటారు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య.. అసలు ఈ హత్యలను చేస్తోంది ఎవరు ? ఎందుకు చేస్తున్నాడు ? అతని మోటివ్ ఏమిటి ? పోలీసులను చంపుతున్న ఆ వ్యక్తిని అన్వర్ ఎలా కనిపెట్టాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరోగా నటించిన అన్వర్ లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా పాత్రకు తగ్గట్లు చాలా బాగున్నాడు. తన యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాలోనే హైలైట్ గా నిలిచాడు. అలాగే కొన్ని ఇన్విస్టిగేషన్ సన్నివేశాల్లో మరియు క్లైమాక్స్ సన్నివేశంలో కూడా చాలా బాగా నటించాడు. ‌ఇక విలన్ గా నటించిన నటుడు కూడా తన నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు.

లేడీ హైయర్ ఆఫీసర్ గా నటించిన నటి కూడా రెండు వేరియేషన్స్ ను ఒకే ఎక్స్ ప్రెషన్ లో చూపించాల్సిన కొన్ని క్రైమ్ సన్నివేశాల్లో… ఆమె చూపించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. అలాగే కథలో మరో కీలక పాత్ర అయిన ‘ప్రమీల పాత్ర’ను చేసిన పూజా రామచంద్రన్ కూడా చక్కగా నటించింది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.

నేటి సమాజంలో చాలా రకాలుగా దాడులు జరుగుతున్నాయి. అయితే పోలీసుల పైనే దాడులు జరిగితే.. ఎలా ఉంటుంది అనే కోణంలో సాగిన ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది.

మైనస్ పాయింట్స్ :

పోలీసుల పై పగ బడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో అనే అంశాన్నే తన సినిమా కాన్సెప్ట్ గా రాసుకున్న దర్శకుడు, ఆ కాన్సెప్ట్ కు తగ్గట్లు కథ కథనాలను మాత్రం ఆసక్తికరంగా రాసుకున్నా కొన్ని చోట్ల మాత్రం లాజిక్స్ వదిలేసాడు. ఆలాగే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కూడా విఫలమైయ్యాడు.

సినిమాలో బలమైన పాయింట్ కనిపిస్తున్నా, ఆ పాయింట్ ని ఎలివేట్ చేసే క్యారెక్టైజేషన్స్ మాత్రం అంత బలంగా ఎస్టాబ్లిష్ కాలేదు. కొన్ని కీలక సన్నివేశాలను ఇంకా క్లారిటీగా చూపెడితే బాగుండేది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ కాన్సెప్ట్ తో కూడిన సన్నివేశాలు సరిగ్గా ఎలివేట్ కాలేదు.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు మంచి ఇంట్రస్టింగ్ కంటెంటే తీసుకున్నప్పటికీ, ఆ కంటెంట్ ని ఎలివేట్ చేసే విధంగా స్క్రిప్ట్ ని రాసుకోలేకపోయారు. సంగీత దర్శకుడు అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ఇక కెమెరామెన్ కెమెరా వర్క్ కూడా చాల బాగుంది. నైట్ జరిగే హత్య సన్నివేశాలను కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. ఎడిటర్ ఎడిటింగ్ సినిమాకి తగ్గట్లుగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

మిడ్ నైట్ మర్డర్స్ అంటూ సాగిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ.. థ్రిల్లర్‌ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. కథలోని కీలక మైన ఇన్విస్టిగేట్ కంటెంట్ బాగుంది. కానీ, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నే విధంగా ఈ సినిమా సాగదు. ఓవరాల్ గా ఈ సినిమాని ఒకసారి హ్యాపీగా చూడొచ్చు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :

More