ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎన్నో ఏళ్ల తన బాక్సింగ్ కెరీర్ లో మైక్ ఎంతోమందికి ప్రేరణగా నిలిచి చరిత్రలో కోా అధ్యాయాన్ని సృష్టించుకున్నారు. మరి మైక్ తో మన టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ అలాగే పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో “లైగర్” లో సాలిడ్ కామియో కూడా చేయించుకున్న సంగతి తెలిసిందే.
అయితే 58 ఏళ్ల మైక్ టైసన్ తో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఒక భారీ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఒక యువ ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ జేక్ పాల్ (Jake Paul) వర్సెస్ మైక్ టైసన్ తో ఒక హిస్టారికల్ బాక్సింగ్ ఈవెంట్ ని సెట్ చేసి దానిని నెట్ ఫ్లిక్స్ లో ఇటీవల లైవ్ స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. మరి ఈ లైవ్ కి మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్ వచ్చినట్టుగా గ్లోబల్ నెట్ ఫ్లిక్స్ వారు రివీల్ చేసారు.
వీరి మ్యాచ్ ని ఏకంగా 60 మిలియన్ మందికి పైగా నెట్ ఫ్లిక్స్ లో లైవ్ స్ట్రీమ్ చేసినట్టుగా వారు వెల్లడించారు. దీనితో ఓటిటిలో ఓ లైవ్ షోకి బిగ్గెస్ట్ రెస్పాన్స్ ఇది అని చెప్పొచ్చు. మరి రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ లో మొత్తం 8 రౌండ్స్ వరకు కూడా మైక్ నిలబడి 27 ఏళ్ళు యువకుడితో పోటీలో నిలిచి పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ జేక్ పాల్ తనకి మైక్ అంటే ఎంతో ఇన్స్పిరేషన్ ని పోటీ అయ్యాక తనకి గౌరవిస్తూ చెప్పాడు.
60 million households around the world tuned in live to watch Paul vs. Tyson!
The boxing mega-event dominated social media, shattered records, and even had our buffering systems on the ropes. pic.twitter.com/kA8LjfAJSk
— Netflix (@netflix) November 16, 2024