పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సీక్వెల్ “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి పాన్ ఇండియా లెవెల్లో ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అంతా ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. అయితే పుష్ప 2 హైప్ మాత్రం ఊహించని లెవెల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది.
మన తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 ఈ మధ్య కాలంలో ఏ పాన్ ఇండియా సినిమా కూడా చెయ్యని రికార్డు ఫిగర్స్ తో బిజినెస్ ని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరాంధ్ర, సీడెడ్ సహా నైజాం ప్రాంతాలలో పుష్ప 2 ఆల్ టైం రికార్డు థియేట్రికల్ బిజినెస్ లేదా RRR కి దగ్గర బిజినెస్ ని చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. దీనితో పుష్ప 2 విషయంలో అంచనాలు ఏ లెవెల్లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ డిసెంబర్ 6న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.