టీవీ9 స్వీట్ హోమ్ ను లాంచ్ చేసిన మంత్రి మల్లారెడ్డి.!

టీవీ9 స్వీట్ హోమ్ ను లాంచ్ చేసిన మంత్రి మల్లారెడ్డి.!

Published on Apr 15, 2023 9:10 AM IST

మన తెలుగు రాష్ట్రాల్లో టెలివిజన్ ఛానెల్స్ లో అయితే ప్రముఖ వార్తా ఛానెల్ టీవీ9 కోసం ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. అయితే లేటెస్ట్ గా హైదరాబాద్ లో అతి పెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో టీవీ9 స్వీట్ హోమ్ ను తెలంగాణ మంత్రి శ్రీ మల్లారెడ్డి గారు హై టెక్స్ ఎగ్జిబిషన్ లో ఈరోజు ప్రారంభించారు.

మరి ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ.. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని, రియల్ ఎస్టేట్ రంగం లో ప్రతీ సంవత్సరం హైదరాబాద్ లో మిగతా నగరాలకంటే ఎక్కువ స్థాయిలో లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ కంపనీలను గా సంప్రదించి చిన్న, మధ్యతరగతి, పెద్ద అన్ని వర్గాల వారికీ అందుబాటు ధరల్లో అన్ని అప్రూవల్స్ తో ప్రాపర్టీ కొనాలనుకున్న వారికి ఇది సరైన వేదిక అని అన్నారు. సొంత ప్రాపర్టీ కొనాలకున్న వారు ఈ అవకాశాన్ని వినియోంచుకోవాలని” సూచించారు.

ఇక టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ & ఇంటీరియర్స్ ఎక్స్‌పో.. రియల్ ఎస్టేట్ డెవలపర్లు, అత్యాధునిక ఫర్నిచర్ ఎంపికలు, ఫర్నిషింగ్ బ్రాండ్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు, హోమ్ డెకర్ ఆప్షన్‌లతో విస్తృత శ్రేణిని ఈ ఎక్స్ పోలో చూడొచ్చు. అలాగే ఆర్థిక సహాయం పొందాలనుకునే కస్టమర్లు బ్యాంకులు అందించే రుణాలపై సమాచారాన్ని పొందవచ్చు. ఈ సేవలన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయి. అలాగే టీవీ 9 చేపట్టిన ఈ కార్యక్రమం హైటెక్ సిటీ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ లో ఆదివారం వరకు జరగనుంది. ప్రవేశం ఉచితం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు