మన ఇండియన్ ఓటిటి దగ్గర మంచి ఫేమ్ ఉన్నటువంటి పలు వెబ్ సిరీస్ లలో ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్నటువంటి పాళీ హిట్ సిరీస్ లు కూడా ఉంటాయి. ఇలా ఇందులో స్ట్రీమ్ అవుతున్న సిరీస్ లలో మాస్ క్రేజ్ ఉన్న వెబ్ సిరీస్ “మీర్జాపూర్” కూడా ఒకటి. మొత్తం మూడు సీజన్లను పూర్తి చేసుకోగా ఈ మూడింటిలో మొదటి సిరీస్ సెన్సేషనల్ హిట్ అయితే రెండు మూడు సీజన్లు ఓకే అనిపించాయి. అయితే సీజన్ 3 రిలీజ్ తర్వాత ప్రైమ్ వీడియో వారు ఒక బోనస్ ఎపిసోడ్ అంటూ టీజ్ చేస్తూ వచ్చారు.
అయితే ఈ బోనస్ ఎపిసోడ్ ని ఫైనల్ గా నిన్న రిలీజ్ చేసారు. అయితే చాలా మంది బోనస్ ఎపిసోడ్ అంటే ముందు ఎపిసోడ్స్ తరహాలోనే ఒక గంటసేపు ఉండే కొనసాగింపు ఎపిసోడ్ ని ఆశించిన వారు కూడా ఉన్నారు. కానీ వారి అందరికి ఈ ఎపిసోడ్ డిజప్పాయింట్ చేసింది అని చెప్పాలి. కేవలం కొన్ని డిలీట్ చేసిన సీన్స్ ని మాత్రమే అందించారు. పైగా ఒక్క హిందీలో మాత్రమే అందించిన రీజనల్ ఫ్యాన్స్ ని మరింత డిజప్పాయింట్ చేసింది. సో ఈ బోనస్ ఎపిసోడ్ వల్ల పెద్దగా ఫ్యాన్స్ కి వచ్చింది ఏమి లేదనే చెప్పాలి.