అవైటెడ్ “మిర్జాపూర్ 3” ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్

అవైటెడ్ “మిర్జాపూర్ 3” ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్

Published on Jun 18, 2024 10:56 AM IST


ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక హిట్ వెబ్ సిరీస్ లలో దాదాపు అన్ని టాప్ మోస్ట్ దేశాల నుంచి మంచి కంటెంట్ ఉన్నాయి. మరి అలా మన దగ్గర నుంచి కూడా ఉన్న హిట్ కంటెంట్ లో ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమేజాన్ ప్రైమ్ వీడియోలో హిట్ అయ్యిన మాస్ సిరీస్ “మిర్జాపూర్” కూడా ఒకటి. మరి ఇప్పుడు వరకు రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఇప్పుడు మూడో సీజన్లోకి వచ్చింది.

ఇక ఈ సిరీస్ ఈ జూలై 5 నుంచి అందుబాటులోకి రానుండగా అసలు ఈసారి కథ ఎలా ఉంటుంది అనే దానిపై ట్రైలర్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇపుడు క్లారిటీ వచ్చేసింది. ఈ ట్రైలర్ ని ఈ జూన్ 20న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ప్రైమ్ వీడియో వారు తెలిపారు. పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, ఇషా తల్వార్, అలీ ఫజల్, విజయ్ వర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే గురుమీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ లు దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు