“మిర్జాపూర్ 3” ట్రైలర్.. పూర్తిగా సరికొత్త ఎనర్జీతో


మన ఇండియన్ ఓటిటి నుంచి హిట్ అయ్యిన పలు సాలిడ్ హిట్ సిరీస్ లలో “మిర్జాపూర్” అనే క్రైమ్ యాక్షన్ సిరీస్ కూడా ఒకటి. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ రెండు సీజన్ లుగా వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఒక్క హిందీలోనే కాకుండా రీజనల్ గా సౌత్ లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఈ సిరీస్ కి ఉన్నాయి. మెయిన్ గా దివ్యెందు శర్మ కి అయితే మొదటి సీజన్ తోనే మంచి క్రేజ్ వచ్చింది.

ఇక సీజన్ కి మరింత పెరగగా తెలుగులో కూడా ప్రమోషన్స్ చేశారు. ఇక ఫైనల్ గా ఇప్పుడు సీజన్ 3 రాబోతుంది. ఇందులో తన పాత్ర లేకపోయినప్పటికీ లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ మాత్రం ఊహించని లెవెల్లో ఉందని చెప్పాలి. మున్నా భయ్యా పాత్ర లేకపోతే సీజన్ 3 చూడము అనుకునేవారికి కూడా చూసే విధంగా ట్రైలర్ ని కట్ చేశారు. అదే మిర్జాపూర్ పూర్వాంచల్ లో పవర్ కోసం జరిగే వార్ మరింత సాలిడ్ గా కనిపిస్తుంది.

మెయిన్ గా అలీ ఫజల్ పోషించిన గుడ్డు పండిట్ రోల్ ఈసారి మరింత పవర్ఫుల్ గా కనిపించేలా ఉందని చెప్పాలి. ఇంకా ఇషా తల్వార్ పొలిటికల్ పవర్ తో ఈ గ్యాంగ్ వార్స్ లాంటి వాటికి సమాధానం చెప్పాలని ఇలా పాలిటిక్స్ యాక్షన్ అన్నీ గట్టిగానే ప్లాన్ చేసినట్టుగా ఉన్నారు.

ఇక ఫైనల్ గా అయితే వెర్సటైల్ నటుడు పంకజ్ త్రిపాఠి ఎంట్రీ తన మిర్జాపూర్ తన సొంతం అన్నట్టుగా ఇచ్చిన ఎండింగ్ ఫ్యాన్స్ కి మరింత ఎగ్జైట్మెంట్ ని అందించింది. మొత్తానికి అయ్యితే ఈ ట్రైలర్ తో సాలిడ్ ట్రీట్ ఫ్యాన్స్ కి రాబోతుంది అని చెప్పాలి. ఇక ఈ కంప్లీట్ సీజన్ ఈ జూలై 5న రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Exit mobile version