‘మిస్ ఇండియా’ రాక పై తప్పుడు వార్తలు !

Published on Jul 14, 2020 2:08 am IST


కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రానున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మిస్ ఇండియా’. అయితే త్వరలో ఈ సినిమా ఓటిటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుందని వార్తలు వస్తున్న తరుణంలో.. ముఖ్యంగా ‘జీ5’కు ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి అమ్మారనే వార్త బాగా వైరల్ అయింది. కానీ తాజా అప్ డేట్ ఏమిటంటే మేకర్స్ ఇప్పటివరకు ఈ చిత్రాన్ని ఎవరికీ అమ్మలేదు. అలాగే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు.

ఇక ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా మహిళల పై ఒక్కో స్టేజిలో ఒక్కో రకంగా దాడుల జరుగుతాయి. ఆ దాడులని ఈ చిత్రంలో విశ్లేషాత్మకంగా చూపించనున్నారని సమాచారం. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న కీర్తి సురేష్.. మరి ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో కూడా ప్రేక్షకుల మనసును గెలుసుకుంటుందేమో చూడాలి.

ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More