వైరల్ పిక్ : “ఈగల్” సక్సెస్ ని సెలబ్రేట్ చేస్తున్న “మిస్టర్ బచ్చన్” టీం

వైరల్ పిక్ : “ఈగల్” సక్సెస్ ని సెలబ్రేట్ చేస్తున్న “మిస్టర్ బచ్చన్” టీం

Published on Feb 11, 2024 12:00 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఈగల్” తన కెరీర్ లో మరో సాలిడ్ ఓపెనర్ గా మంచి టాక్ తో ఇప్పుడు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. యంగ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కి మంచి ఫీస్ట్ ని ఇచ్చింది. ఇక ఈ చిత్రం సక్సెస్ తో ఈ చిత్ర యూనిట్ తో పాటుగా మరో చిత్ర యూనిట్ కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారు.

మరి ఇదే సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారితో రవితేజ దర్శకుడు హరీష్ శంకర్ తో “మిస్టర్ బచ్చన్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు ఈగల్ సక్సెస్ సెలెబ్రేషన్స్ చేస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ అయితే రవితేజ హిట్ అందుకోవడంతో తాను హిట్ అందుకున్న రేంజ్ లో ఆనందం వ్యక్తం చేస్తున్న పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీనితో ఈ సూపర్ హ్యాపీ స్నాప్ అయితే వారి ఫ్యాన్స్ లో మరింత ఆనందాన్ని నెలకొల్పింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు