“RRR” విషయంలో కౌంటర్ మీద కౌంటర్ ఇస్తున్న కీరవాణి..మరింత హుందాగా ఈ ట్వీట్.!

Published on Jul 6, 2022 7:07 am IST

గత రెండు రోజులు నుంచి మన టాలీవుడ్ ప్రైడ్ “రౌద్రం రణం రుధిరం” విషయంలో ఓ అంశంపై సోషల్ మీడియాలో రచ్చ లేస్తుంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి ఈ సెన్సేషనల్ హిట్ సినిమాపై కొన్ని అభ్యంతరకర కామెంట్స్ చేయడం అభిమానులను టాలీవుడ్ పెద్దలు సహా సినిమా యూనిట్ ని కూడా తీవ్ర ఆగ్రహానికి లోను చేసింది. దీనితో ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం ఇచ్చిన సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి అయితే తనదైన శైలిలో అతడికి నాన్ స్టాప్ కౌంటర్ లు వేస్తూనే ఉన్నారు.

మరి వాటిలో హుందాగా చేసిన ఒకటి అయితే ఈ సినిమాపై వేరే తరహా కామెంట్స్ చేసే వారి కళ్ళు తెరిపించింది అని చెప్పాలి. తాను ట్వీట్ చేస్తూ నాకు ఈ సినిమాలో అల్లూరి గానీ భీమ్ పాత్రలు గాని కనిపించలేదు అని తన కూతురు మల్లి ని కలవాలనే తన తల్లి యొక్క దృఢ సంకల్పమే నాకు కనిపించింది. నా కంటి చూపు ఇప్పుడు మెరుగయ్యింది అని అనుకుంటున్నాను అని ఒక అదిరే కౌంటర్ ని కీరవాణి చేశారు. దీనితో ఇది మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :