నందమూరి బాలకృష్ణ ‘శ్రీ రామ రాజ్యం’ గురించి ఒక ఆసక్తికరమైన వార్త. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ భక్తిరస మహత్తర చిత్ర రాజం ఆర్ఆర్ మూవీ మకర్స్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విస్తృతమైన డిఐ మరియు గ్రాఫిక్స్ పని వాళ్ళ ఈ చిత్ర విడుదల ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. పరిశ్రమ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నవంబర్ 28న విడుదల అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా చెప్పగలిగినదేమిటంటే.. ఆర్ఆర్ మూవీ మేకర్స్ భారీ ఎత్తున, సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లు లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్రణాలిక సిద్దం చేస్తుంది. ఇది చిత్ర విజయానికి చాల వరకూ అనుకూలిస్తుంది.
‘శ్రీ రామ రాజ్యం’ చిత్రంలో నయనతార.. సీత పాత్రను పోషిస్తుండగా, సుప్రసిద్ధ నటుడు అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకి పాత్రలో నటిస్తున్నారు. ఇంకా లక్ష్మణ, భూదేవి పాత్రల్లో శ్రీకాంత్, రోజా కనిపిస్తారు.