ఎన్టీఆర్ “దమ్ము” నుంచి శృతి హాసన్ ఔట్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోయే చిత్రం ‘దమ్ము’ నుంచి వైదొలగాలని నటి శృతి హాసన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. చాలా కాలం గ్యాప్ తరువాత ఈ చిత్రం ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ లో పునః ప్రారంభమైంది. అయితే, డేట్స్ కుదరక శృతి హాసన్ ఈ మూవీ నుంచి నిష్క్రమించాలని అనుకుంటుందట.

మాకందిన సమాచారం ప్రకారం, అసలు ఈ ఏడాది ఆరంభంలో ‘దమ్ము’ ప్రాజెక్ట్ పై సంతకం చేసేటప్పుడు శృతి చాలా ఉత్సాహంతో ఉన్నారని, అయితే ఈ షూటింగ్ చాల ఆలస్యం కావటం తో డేట్స్ మేనేజ్ చేయటం ఆమెకు చాలా ఇబ్బందిగా పరిణమించినట్టు తెలిసింది. ఫ్యుచర్ కమిట్మెంట్స్ దృష్ట్యా ఆమెకు కొత్త డేట్స్ ఇవ్వటం తలకు మించిన భారంగా మారిందట. ఈ ఇబ్బందిని ‘దమ్ము’ టీం కూడా స్నేహపూర్వకంగా అర్థం చేసుకుందని వెల్లడి.

నిజంగా కూడా, శ్రుతి ఈ డేట్స్ ఇబ్బందుల గురించి ఇటీవల తన ట్విట్టర్ పోస్టింగ్స్ లో (నాకు రోజుకు 48 గంటలు, వారానికి 10 రోజులు ఉంటే బాగుంటుంది) పేర్కొన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం శ్రుతి హాసన్ తెలుగు లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలోనూ.. తమిళ్ చిత్రం ధనుష్స్ 3 .. ఇంకా, సూర్య సరసన నటించి, విడుదలకు సిద్దంగా ఉన్న ఆమె తొలి తమిళ చిత్రం ఎజ్హం అరివు (7 న్త్ సెన్స్).. రిలేజ్ కు రెడీ గా ఉన్న మరో చిత్రం ‘ఓ మై ఫ్రెండ్’ (సిద్దార్థ్ సరసన) చిత్రాలతో శ్రుతి బడలిక లేకుండా ఉంది.

Exit mobile version