డేట్స్ సర్దుబాటు కాక నటి శృతి హాసన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దమ్ము’ చిత్రం నుంచి వైదొలిగిన సంగతి ఇప్పటికే మీకు చెప్పటం జరిగింది. ఈ కారణంగా చిత్రం షూటింగ్ షెడ్యూల్ కు అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు నిర్మాతలు వేగంగా ఆ భర్తీ పూరించేందుకు శోధిస్తున్నారు.
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం వీరి కళ్ళు కాజల్ అగర్వాల్ పై ఉన్నట్టు తెలుస్తుంది. బృందావనంలో ఎన్టీఆర్ తో కాజల్ మంచి స్క్రీన్ కెమిస్ట్రీ చేయటం మనం చూసాం. అయితే కాజల్ ప్రస్తుతం ప్రిన్సు మహేష్ బాబు చిత్రం ‘బిజినెస్ మాన్’ నటిస్తూ చాల బిజీగా ఉంది. ఇక ఈ రేస్ లో ఉన్న సమంతా మరియు తమన్నా కూడా వివిధ ప్రాజెక్ట్ లలో వారివారి షూటింగ్ లతో బిజీ గానే ఉన్నారు. మరో పెద్ద చిత్రానికి డేట్స్ సర్దుబాటు చేయాలంటే వారికీ తలకు మించిన భారమే అవుతుంది.
కాగా, ఈ భర్తీ కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. శృతి నిష్క్రమణ కాజల్ కు కలసోస్తుందేమో చూడాలి. చూద్దాం ఈ అంశం ఎలా పూర్తవుతుందో.