ఐశ్వర్యకు ఇవాళ శ్రీమంతం

ఐశ్వర్యకు ఇవాళ శ్రీమంతం

Published on Oct 17, 2011 4:38 AM IST


ఈ మధ్య కాలంలో బచ్చన్స్ చాల ఆనందంగా ఉన్నారు. ఐశ్వర్య రాయ్ ను చూస్తున్న వాళ్ళు చెబుతున్నదేమంటే.. ఆనందాల బావురును మోస్తున్న ఐష్ చాలా ఆనందం గానే కాదు, చాల ప్రకాశవంతంగా మెరిసిపోతున్నారని. గర్భిణి గా ఉన్న ఐశ్వర్య కు ఆమె అత్తగారు జయా బచ్చన్ ఇవాళ గ్రాండ్ బేబీ షవర్ (శ్రీమంతం) నిర్వహించారు. దీనికి సంబంధించిన వేడుక వారి నివాసం ‘జల్సా’ లో ఇవాళ జరుగనుంది.

మనకందిన సమాచారం ప్రకారం అమితాట్టహాసంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి క్లోజ్ ఫ్రెండ్స్, దగ్గరి బంధువులను మాత్రమే ఆహ్వానించినట్టు తెలిసింది. ప్రపంచమంతా ఎంతో ఆత్రం గా ఎదురుచూస్తున్న ఈ ‘ఐష్ బేబీ’ త్వరలోనే అందరి కళ్ళ ముందూ కదలాడనుంది.

ఐశ్వర్య మరియు బచ్చన్స్ కు బెస్ట్ విషెస్ తెలుపుదాం ..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు