‘బాణం’ చిత్రానికి దర్శకత్వం చేసిన చైతన్య దంతులూరి తాజాగా ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంలో ఒక పాటకు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ పాటను ప్రస్తుతం పూనే-ముంబై హైవే పై షూట్ చేస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా ఈ ఫైనల్ సాంగ్ ను సమీక్షిస్తారనుకోండి.. అయితే శ్రీరామ్ ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసేందుకు గాను హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.
ఏమైనాకాని ఈ తరహ సంఘటన ఇదే కొత్తకాదు. ఇంతకుముందు కూడా ఒక దర్శకుడికి మరో దర్శకుడు సహకరించిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ‘ఆరంజ్’ చిత్రానికి సంబంధించి భాస్కర్ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పుడు, ఆనంద్ రంగ పర్యవేక్షణలో కొన్ని పాటలను చిత్రీకరించిన సంగతి తెలిసిందే.
సిద్ధార్థ్, శృతి హాసన్, హన్సిక మరియు నవదీప్ ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రానికి విజయ్ కె చక్రవర్తి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. రాహుల్ రాజ్ సంగీతం. ఈ సినిమాను నవంబర్ 11 న తెరల పై కదలాడించాలని భావిస్తున్నారు.