సుప్రసిద్ధ అందాల నటి శ్రీదేవి మళ్లీ తెలుగు తెర పై రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. అయితే అది ఒక డైరెక్ట్తెలుగు సినిమా మాత్రం కాదు. శ్రీదేవి తెలుగు చిత్ర సీమను వదిలి ఇప్పటికే దశాబ్దం పైగా అయినప్పటికీ, ఆమెఇప్పటికీ తెలుగు సినిమా లో అత్యంత ప్రియమైన, ప్రముఖ నటిగా కొనసాగుతోంది. శ్రీదేవి మళ్లీ తెలుగు చిత్ర సీమలో పునః ప్రవేశిస్తారని, ఆమె చిరంజీవి యొక్క 150 వ చిత్రం లో ప్రధాన పాత్ర పోషిస్తారంటూ గత కొన్ని నెలలుగా రూమర్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ వదంతులను శ్రీదేవి ఖండించారు. ఆమె ప్రస్తుతం తన రీ ఎంట్రీ మూవీ ‘ఇంగ్లీష్ వింగ్లిష్’ చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.
ప్రధానంగా హిందీ లో చిత్రీకరిస్తున్న ‘ఇంగ్లీష్ వింగ్లిష్’ చిత్రానికి నిర్మాత, బల్కి భార్య గౌరీ షిండే. గతంలో ఈమె పా, చీని కం, తదితర చిత్రాలు నిర్మించారు. అయితే శ్రీదేవికి ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు లో ఉన్న పాపులారిటి ని దృష్టిలో ఉంచుకుని చిత్ర నిర్మాతలు గౌరీ, బల్కి లు ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో కూడా రీమేక్ చేయాలని చూస్తున్నట్టు తెలిసింది. అలాగే మూడు భాషల్లోనూ ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదలచేయాలని యోచిస్తున్నట్టూ సమాచారం.