నాగేశ్వర రావు వాల్మీకి పాత్ర చిరస్మరణీయం

నిర్మాత యలమంచిలి సాయిబాబా, డైరెక్టర్ బాపుల అంచనాలు పూర్తి స్థాయీ ఫలితాలనిస్తున్నాయి. సుప్రసిద్ధ నటుడు అక్కినేనితో వాల్మీకి పాత్రను చేయించాలన్నవారి నిర్ణయం వంద శాతం మార్కులు కొట్టేసింది. నందమూరి నట సింహం బాలయ్య పురాణ ఇతిహాస నేపధ్య చిత్రం ‘శ్రీ రామ రాజ్యం’ లో అక్కినేని వాల్మీకి పాత్రను అద్భుతంగా మెప్పించారని సమాచారం. ఇది అక్కినేని నాగేశ్వర రావు సినీ జీవితంలో మరో మైలురాయి కానుందని తెలుస్తోంది. వాల్మీకి.. సీతా దేవి కి ఆశ్రయమివ్వటమే కాక, రాముని కుమారులకు సకల విద్యలూ నేర్పిన గురువుగా సుపరిచితులు. భవిష్యత్ తరాల వారికి రామాయణం గురించి చెప్పి వారిని మంచి బాటలో నడిపించాలనే సదుద్దేశ్యంతో దర్శకుడు బాపు ఓ యాగంలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్- ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రముఖ గాయకులు, విద్వాంసులు ఈ చిత్రానికి పాటలను ఆలపించగా, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటలు ఇప్పటికే అద్భుతమైన ఆదరణను సంపాదించాయి. ఈ మహత్తర చిత్ర రాజం నవంబర్ లో విడుదల కాబోతుంది

Exit mobile version