నీతూ నిర్మాత అవతారం


హీరోయిన్లు నిర్మతలుగా రూపాంతరం చెందటం ప్రస్తుతం సాధారణమైపోయింది. ఆల్రెడీ, అమీషా పటేల్, ప్రీతి జింటా ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే దియా మీర్జా ఓ చిత్రాన్ని నిర్మించారుకూడా. ఆ జాబితాలోకే ఇప్పుడు నీతూ చంద్ర చేరారు.

‘దేశ్వా’ అనే భోజ్ పురి చిత్రాన్ని నీతూ నిర్మిస్తున్నారు. ఆమె సోదరుడు నితిన్ ఈ చిత్రానికి దర్శకుడు. అంతేకాదు ఈ అమ్మడు ఈ మూవీ తర్వాత ఒక హిందీ చిత్రాన్ని కూడా తీసే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించింది. అయితే అది ఇప్పుడు కాదట. ప్రస్తుతం నటిగా ఆరు హిందీ చిత్రాల్లో నటిస్తున్నా, ఆ తర్వాతే హిందీ చిత్ర నిర్మాణాన్ని చేపడతానంటోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదండోయ్.. ఈ అమ్మడు ఏమంటుందంటే.. బాలీవుడ్ లో ఇప్పటికే జోయా అఖ్తర్ – ఫర్హాన్ అఖ్తర్, ఫరా ఖాన్ – సాజిద్ ఖాన్, ఇలా సోదరీసోదర ద్వయం ఉన్నారు. అలానే మేమూ పేరు తెచ్చుకోవాలనుకొంటున్నాం.

నేను నిర్మాతగా, నటిగా ఉంటే, నా సోదరుడు దర్శకత్వం చేస్తాడు. అంటోంది.

Exit mobile version