టాలీవుడ్ కి ఒక అద్బుతమైన సంవత్సరం

టాలీవుడ్ కి ఒక అద్బుతమైన సంవత్సరం

Published on Nov 19, 2011 1:40 AM IST

 

మొదటగా దూకుడు ఇప్పుడు శ్రీ రామ రాజ్యం. రెండు చిత్రాలు రెండు విభిన్నమైన కోణాలకు చెందినవి.
మహేష్ బాబు బాక్స్ ఆఫీసు వద్ద విజయ పథకం ఎగుర వేయగా ఇప్పుడు శ్రీ రామ రాజ్యం విజయం
విజయాన్ని అందుకొంది. ఇది పరిశ్రమకు శుభ పరిణామం. ప్రేక్షకులను సినిమా హాలుకు వరకు
రప్పించడంలో నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు కృషి అభినందనీయం. ప్రేక్షకులు మరియు
విమర్శుకులు విభిన్నమైన చిత్రాలు కోరుకుంటున్నారు అదే విధంగా వాణిజ్య అంశాలు కూడా మేళవిస్తూ
తీయడం అన్ని సమయాల్లో అంత సులభం కాదు. బాపు గారు తన పూర్వ వైభవాన్ని చూపుతూ ప్రేక్షకులకు
కట్టిపడేసారు. రామాయణం లాంటి పౌరాణిక చిత్రాలు తీయడంలో ఆయనది అందే వేసిన చేయి. బాలకృష్ణ మరియు
ఏఎన్నార్ ఆ పాత్రలకు అచ్చు గుద్దినట్లుగా సరిపోయారు. ఇళయరాజా గారి సంగీతం కూడా అద్బుతంగా అందించారు.
రాముడి కథను నేటికి తగ్గట్టుగా కూడా తీసి చూపించారు. సినిమాని ఎలా నిర్మించాలో శ్రీ రామ రాజ్యం మిగతా
తెలుగు సినిమాకి ఒక అద్బుతమైన ప్రకటన లాంటిది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు