బేంబూ ఫారెస్ట్ లో రచ్చ ఫైటింగ్ సీక్వెన్స్

బేంబూ ఫారెస్ట్ లో రచ్చ ఫైటింగ్ సీక్వెన్స్

Published on Nov 22, 2011 2:00 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లేటెస్ట్ ఫిలిం ‘రచ్చ’. ఈ చిత్రం ప్రస్తుతం చైనా దేశంలోని అంజి అనే పట్టణంలో షూటింగ్ జరుపుకుంటోంది. అంజి, షాంఘై నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. అది చైనా లోనే అతిపెద్ద అడవైన నేషనల్ బేంబూ ఫారెస్ట్ ఉన్న ప్రదేశం. చైనీస్ పాపులర్ ఫిల్మ్ ‘క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్’ ను కొన్నేళ్ల క్రితం అక్కడే చిత్రీకరించారు. అయితే ఒక తెలుగు సినిమాను అక్కడ షూట్ చేయటం ఇదే తొలిసారి. ప్రస్తుతం అక్కడ రచ్చ ఫైటింగ్ సన్నివేశాలు తీస్తున్నారు.

సంపత్ నంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్వి ప్రసాద్, పారస్ జైన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మరో నటుడు అజ్మల్ (రంగం ఫేం) ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘రచ్చ చిత్రాన్ని కంప్లీట్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు. ఈ మధ్యే ‘వాన వాన వెల్లూవాయే’ పాటకు రీమిక్స్ వెర్షన్ ను చరణ్ -తమన్నా లపై చిత్రీకరించారు.

మణిశర్మ ఈ మూవీ కి సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు