విడుదల తేదీ : జులై 28, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ, మురళి శర్మ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్ తదితరులు
దర్శకత్వం : ఈ టీవీ ప్రభాకర్
నిర్మాతలు : శైలేంద్ర బాబు
సంగీతం : జేబీ
సినిమాటోగ్రఫర్ : కార్తీక్ పళని
రచన, స్క్రీన్ ప్లే : మారుతి
ఎడిటర్ : ఉద్ధవ్ ఎస్.బి
ఈ టీవీ ప్రభాకర్ దర్శకత్వంలో సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శైలేంద్ర బాబు నిర్మించారు. కాగా ప్రముఖ దర్శకుడు మారుతీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
డైమండ్ బాబు (సుమంత్ శైలేంద్ర)ను చిన్నప్పటి నుంచీ బ్రాండ్ ల మధ్య, హైక్లాస్ స్టేటస్ ల మధ్య, ఎమోషన్ కి దూరంగా కరెన్సీకి దగ్గరిగా పెంచుతాడు అతని తండ్రి (మురళీ శర్మ). బ్రాండ్ పిచ్చి పీక్ లో ఉన్న మురళీ శర్మ, తన పిచ్చిని తన కొడుక్కి (సుమంత్ శైలేంద్ర) కూడా నూరిపోస్తాడు. దాంతో బ్రాండ్ బాబు(సుమంత్ శైలేంద్ర) తాను చేసుకోబోయే అమ్మాయి స్టేటస్ వల్ల, తన బ్రాండ్ ఇంకా పెరగాలనుకుంటాడు. అలా బాగా రిచ్ గర్ల్ కోసం ట్రై చేస్తున్న సమయంలో తనకి వచ్చిన ఫోన్ కాల్స్, కొన్ని సంఘటనల ఆధారంగా తనని హోమ్ మినిష్టర్ కూతురు (పూజిత పొన్నాడా) ప్రేమిస్తుందని నమ్మాల్సి వస్తోంది. ఆ విషయం ఆమె చేతే చెప్పించి, ఆమెను పెళ్లికి ఒప్పించే ప్రయత్నంలో.. ఫోన్ లో హోమ్ మినిష్టర్ కూతురికి బదులు ఆ ఇంటిలోని పనిమనిషి (ఈషా రెబ్బ)ను ప్రేమలో దించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో బ్రాండ్ బాబు చేసే ఓ మంచి పని వల్ల ఈషా రెబ్బ కూడా అతనితో ప్రేమలో పడుతుంది.
ఇక ఈషాతో నిశ్చితార్ధానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత బ్రాండ్ బాబుకు అసలు విషయం తెలుస్తోంది. తాను ప్రేమించింది హోమ్ మినిష్టర్ కూతురును కాదు, ఆ ఇంటి పనిమనిషిని అని. దాంతో ఈషాతో నిశ్చితార్ధం క్యాన్సిల్ చేసుకుంటాడు. ఆ తర్వాత జరిగే కొన్ని పరిణామాలు తర్వాత బ్రాండ్ బాబు కుటుంబ పరువు మొత్తం పోతుంది. పోయిన పరువు కోసం బ్రాండ్ బాబు ఫ్యామిలీ ఏం చేసింది ? తన వల్ల బాధ పడుతున్న బ్రాండ్ బాబు ఫ్యామిలీ కోసం ఈషా ఏం చేసింది ? అసలు బ్రాండ్ పిచ్చి ఉన్న హీరో మారాడా ? హీరో హీరోయిన్లు కలుస్తారా ? కలిస్తే బ్రాండ్ పిచ్చి పీక్ లో ఉన్న హీరో ఫాదర్ (మురళి శర్మ) అంగీకరించాడా ? చివరకి ఈ బ్రాండ్ బాబు ప్రేమ కథ ఎలా ముగిసింది ? లాంటి విషయాలు తెలియాలంటే బ్రాండ్ బాబు చిత్రం చూడాలసిందే.
ప్లస్ పాయింట్స్ :
తెలుగులో మొదటి సారి హీరోగా నటించిన సుమంత్ శైలేంద్ర బ్రాండ్ బాబు పాత్రలో పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ఎలాంటి తడబాటు బెఱుకు లేకుండా చాలా చక్కగా కాన్ఫిడెంట్ గా నటించాడు. డాన్స్, ఆయన లుక్ కూడా బాగుంది. పనిమనిషి పాత్రలో నటించిన హీరోయిన్ ఈషా రెబ్బ తన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరోతో సాగే సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు, ఆమె నటన సినిమాకే హైలెట్ నిలుస్తాయి.
ఇక బ్రాండ్ బాబు ఫాదర్ గా, బ్రాండ్ పిచ్చి పీక్ లో ఉన్న పాత్రను పోషించిన మురళి శర్మ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నారు. అయన తన బ్రాండ్ మోజులో ఇటు నవ్విస్తూనే అటు ఎమోషనల్ సన్నివేశాలను కూడా చాలా చక్కగా పండించారు. క్లైమాక్స్ లో తనకున్న బ్రాండ్ మోజు పై తన కొడుకే ఎదురు తిరిగిన సందర్భంలో ఆయన చూపిన ఎక్స్ ప్రెషన్స్ ఆయన నటన మెచ్చుకోదగినది.
రైటర్ గా కనిపించిన కమెడియన్ సత్యం రాజేష్ తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా నవ్వించగా హీరో అసిస్టెంట్స్ గా నటించిన వేణు, సాయి కూడా తమ మ్యానరిజమ్స్ తో డైలాగ్ మాడ్యులేషన్స్ తో నవ్వించే ప్రయత్నం చేశారు. దర్శకుడు మారుతి అందించిన ఈ స్క్రిప్ట్ లో మూవీ కాన్సెప్ట్, ప్రత్యేకంగా మురళి శర్మ, హీరోల క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
దర్శక రచయితలూ మొదటి అర్ధభాగాన్ని సినిమా థీమ్ తో పాటు పాత్రలను, వాటి స్వభావాల్ని పరిచయం చేస్తూ సరదాగా నడిపినా, రెండో భాగం మాత్రం ఫ్లో లేని సీన్లతో ఇంట్రస్ట్ లేని సన్నివేశాలతో, కన్వీన్స్ కానీ నేరేషన్ తో స్లోగా నడిపిస్తూ సినిమా ఫలితాన్ని దెబ్బ తీశారు.
ఇంటర్వెల్ సీన్ లో ఇచ్చిన ట్విస్ట్ తో సెకెండాఫ్ పై అంచనాలు పెచ్చిన దర్శక రచయితలు, ఆ అంచనాలు మాత్రం అందుకోలేకపోగా, పస లేని సీన్లతో అనవసరమైన కాలక్షేపం చేశారు. పైగా రెండువ భాగంలో హీరో పాత్రను ఫేక్ ఎమోషన్ తో నింపేసి కథ పై ఉన్న ఉత్సుకతను పోగొట్టారు. తన వల్ల హీరో ఫ్యామిలీ పరువు పోకూడదని ఫీల్ అయ్యే హీరోయిన్ ఎంత పెయిన్ గా అనుభవిస్తోన్న, ఆ పెయిన్ లో మాత్రం ఆడియన్స్ ఇన్ వాల్వ్ అవ్వరు.
మంచి కాన్సెప్ట్ తో ఇంట్రెస్ట్ గా మొదలైన ఈ చిత్రం, ఆ ఇంట్రెస్ట్ ను మాత్రం చివరి వరకు మెయింటైన్ చేయలేకపోయింది. సినిమాలోని ఆసక్తిని పెంచే సన్నివేశాలను రాసుకోవటానికి స్కోప్ ఉన్న ఈ చిత్ర రచయిత మాత్రం సింపుల్ గానే కథను నడిపించారు.
ముఖ్యంగా ‘పీఎమ్’ పూర్ అండ్ మధ్య తరగితి అని హీరో ఫ్యామిలీ మీద రివెంజ్ తీర్చుకున్నే సీన్లు కూడా సహజత్వానికి దూరంగా చాలా నాటకీయంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ లో ఇరికించి మరి పెట్టిన ఫైట్, రొటీన్ ముగింపుతో బ్రాండ్ బాబు సగటు సినిమాలాగే అనిపిస్తోంది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు ప్రభాకర్, మారుతి అందించిన స్క్రిప్ట్ ను బాగానే తెరకెక్కించన్నప్పటికీ స్క్రిప్ట్ లో కొన్ని లోపాలు ఉండటం కారణంగా దర్శకుడు ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా మలచలేకపోయారు. సంగీత దర్శకుడు జేబీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే ఆయన సమకూర్చున పాటలు కూడా పర్వాలేదనిపించగా హీరోయిన్, హీరో ఇంటికి వచ్చాక వచ్చే పాట బాగా ఆకట్టుకుంటుంది.
కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా ఎక్కడా బ్యూటి తగ్గకుండా చిత్రీకరించారు. ఉద్ధవ్ ఎస్.బి ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సెకెండాఫ్ లోని విషయం లేని సీన్లను, ప్లో లేని సన్నివేశాలను కొన్ని సాగతీత సీన్స్ ను కూడా తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాత శైలేంద్ర బాబు తన తనయుడు కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రానికి అవసరమైన దానికంటే ఎక్కువే ఖర్చు పెట్టారు. ఆయన పాటించిన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
తీర్పు :
మారుతీ ఈ చిత్రానికి కథ అందించడం, పైగా ఆయన గత చిత్రాలు భలే భలే మగాడివోయి, మహానుభావుడు చిత్రాల శైలిలోనే ఈ చిత్రం కూడా ఉంటుందని ప్రచారం చెయ్యడంతో ‘బ్రాండ్ బాబు’ పై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబర్చారు. దానికి తోడు టీజర్ ట్రైలర్ లో బ్రాండ్ పిచ్చి అనే కాన్సెప్ట్ ను హైలెట్ చెయ్యటంతో సినిమా పై అమాంతం అంచనాలు పెరిగాయి.
కానీ సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. సెకెండాఫ్ ఫ్లో లేని సీన్లతో ఇంట్రస్ట్ లేని సన్నివేశాలతో, కన్వీన్స్ కానీ నేరేషన్ తో స్లోగా సాగడం, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, రొమాన్స్ లోపించడం, దానికి తోడు చాలా సన్నివేశాలు మరీ నాటకీయంగా ఉండటంతో సినిమా సగటు సినిమాగానే మిగిలిపోయింది. కానీ మూవీ కాన్సెప్ట్, మొదటి అర్ధ భాగంలో అక్కడక్కడా కొన్ని నవ్వించే సంఘనటలు, ఇంటర్వెల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ అంశాలు కారణంగా బి.సి ప్రేక్షకులు ఈ సినిమా పై కొంత ఆసక్తిని చూపించొచ్చు.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team