రణబీర్ సినిమా చూసి కంటతడి పెట్టిన దీపిక

అందాల ముద్దుగుమ్మ దీపిక పడుకొనే ఒకప్పుడు రణబీర్ కపూర్ తో ఘాటైన ప్రేమ వ్యవహారాన్ని సాగించిన విషయం అందరికి తెలిసినదే. ఇప్పుడు వీరిద్దరూ విడిపోయినప్పటికీ, మంచి స్నేహితులు గా మిగిలిపోయారు.

ఇటివల రణబీర్ తన మిత్రుల కోసం ‘రాక్ స్టార్’ చిత్రాన్ని ఒక ప్రత్యేకమైన షో వేసి మరీ చూపించాడు. ఈ షో కు దీపిక కూడా విచ్చేసింది. అయితే సినిమా చూస్తున్నంత సేపు దీపిక చాలా ఉద్రేకానికి లోనయిందని వినికిడి. సినిమా చుసిన కొందరైతే దీపిక కంటతడి కూడా పెట్టుకుందని చెప్పారు.

దీఎపిక విషయం అటుంచితే, రణబీర్ తన నటన తో అందరి మన్ననలను అందుకుంటున్నాడు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఆడుతున్న, రణబీర్ నటనకు నూటికి నూరు మార్కులు పడుతున్నాయి.

Exit mobile version