శివరాత్రికి పోటీ పడుతున్న నాలుగు సినిమాలు

శివరాత్రికి పోటీ పడుతున్న నాలుగు సినిమాలు

Published on Jan 30, 2012 10:17 AM IST

పండగలకి లేదా సెలవుల్లో సినిమాలు విడుదలైతే పెద్ద విజయాలు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే పండగ సీజన్లో సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు ఉత్సాహం చూపిస్తుంటారు. త్వరలో మహాశివరాత్రి రాబోతున్న సందర్భంగా ఈ సెలవుల సీజన్ ని క్యాష్ చేసుకునేందుకు కొన్ని సినిమాలు సిద్ధమవుతున్నాయి. నందమూరి బాలకృష్ణ నటించిన ‘అధినాయకుడు’ మరియు మాస్ మహారాజ రవితేజ నటించిన ‘నిప్పు’ వంటి పెద్ద చిత్రాలు పోటీ పడుతుండగా వీటితో పాటుగా మంచు మనోజ్ నటించిన మిస్టర్ నోకియా చిత్రం కూడా ఫిబ్రవరి 17 న విడుదలకు సిద్ధమవుతున్నాయి. సిద్ధార్థ్ నటించిన లవ్ ఫేల్యూర్ కూడా ఇదే వారంలో రాబోతుండటంతో పోటీ వాతావరణం నెలకొంది. ఈ సెలవులకి ఏ చిత్రం విజయం సాధిస్తుందో వేచి చూద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు