ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి పండుగ సినిమాగా మారి సాలిడ్ హిట్ గా నిలిచిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది అక్కినేని వారి మరో క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “బంగార్రాజు” అనే చెప్పాలి. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అక్కినేని నాగార్జున మరియు నాగ చైతన్యల తో గత చిత్రం “సోగ్గాడే చిన్ని నాయన” కి సీక్వెల్ గా చేసిన ఈ సినిమా కూడా ఆ సినిమా తరహా లోనే మంచి హిట్ అయ్యి వారి ఖాతాల్లో మరో హిట్ గా నిలిచింది.
మరి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఓటిటి లో ఎప్పుడెప్పుడు వస్తుందా అని కూడా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూడగా ఇప్పుడు ఫైనల్ గా అందుకు తెర పడింది.. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న జీ 5 ఓటిటి లో ఈరోజు ఫిబ్రవరి 18న డిజిటల్ ప్రీమియర్ గా అందరి ముందుకు వచ్చేసింది. మరి అప్పుడు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇక ఇప్పుడు నుంచి చూసేయొచ్చు.