బాలీవుడ్ హీరో సన్నీ డియోల్, టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జాట్’ మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ సన్నీ డియోల్ మరోసారి తన యాక్షన్ పంజా పవర్ ఏమిటో చూపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించడంతో, ఇటు టాలీవుడ్‌లోనూ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
ఇక ఈ మూవీని ప్రేక్షకుల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ఈ చిత్ర యూనిట్‌కు తన టైమ్ కేటాయించాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను తాజాగా జాట్ టీమ్ కలిసింది. సన్నీ డియోల్‌తో పాటు గోపీచంద్ మలినేని ప్రభాస్‌ను కలిసిన ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ‘జాట్’ కోసం ప్రభాస్ తనదైన సపోర్ట్ ఇస్తున్నాడని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలను అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు.
జాట్ చిత్రాన్ని పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందించగా.. ఈ సినిమాలో రణ్‌దీప్ హుడా, రెజీనా కాసాండ్ర, సయ్యామీ ఖేర్, వినీత్ కుమార్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ప్రొడ్యూ్స్ చేస్తున్నారు.