బిజినెస్ మేన్ 2 లో కృష్ణ మనోహర్ తో సూర్య భాయ్ పోరాడబోతున్నడా?

బిజినెస్ మేన్ 2 లో కృష్ణ మనోహర్ తో సూర్య భాయ్ పోరాడబోతున్నడా?

Published on Jan 29, 2012 6:31 PM IST

ప్రిన్స్ మహేష్ బాబు ‘బిజినెస్ మేన్’ భారీ విజయం సాధించిన సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు బిజినెస్ మేన్ 2 చిత్రం తీస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కథ పై ఎవరికీ వారు వారికీ తోచినట్లు కథలు చెప్పేస్తున్నారు. టీవీ లో దీనిపై ప్రోగ్రామ్స్ కూడా చేసేస్తున్నారు. మహేష్ పోకిరి సినిమాలో కృష్ణ మనోహర్ పాత్రని మళ్లీ పోషించబోతున్నారానీ, బిజినెస్ మేన్ సూర్య భాయ్ పత్రాణి కూడా ఈ చిత్రంలో కంటిన్యూ చేస్తూ మహేష్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తారని అంటున్నారు. సూర్య భాయిని వెతుకుతూ కృష్ణ మనోహర్ మళ్లీ వస్తాడనీ కూడా అంటున్నారు. బిజినెస్ మేన్ చిత్రం చివర్లో ఒక డైలాగ్ ఉంటుంది ‘నాకు ఏమీ కాకుండా తిరిగివస్తే ఇండియా దూల తీర్చేస్తా’ అని అంటాడు. ఈ సారి కృష్ణ మనోహర్ తో సూర్య భాయ్ తలపడబోతున్నాడా అనే దానికి కాలమే సమాధానం చెబుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు