చారిత్రక నేపధ్యంతో సాగే కింగ్ అక్కినేని నాగార్జున తదుపరి చిత్రం ‘రాజన్న’. ప్రొడక్షన్ వర్క్ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసుకుంటున్నఈ సినిమా డిసెంబర్ 27 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ ఆడియో లాంచింగ్ ఫంక్షన్ నవంబర్ 27వ తేదీన పెద్ద ఎత్తున జరిపేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తేదీ విషయమై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్ర్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చారిత్రక కథాంశంతో సాగే ఈ చిత్రాన్ని సుద్దాల హనుమంతు నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. స్నేహ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాకు 1950 నాటి తెలంగాణా గ్రామాలు పునః నిర్మించేందుకు అత్యాధునిక విజువల్ ఎఫ్ఫెక్ట్స్ తో చితీకరిస్తున్నారు. యాక్షన్ ఎపిస్తోడ్స్ ఈ చిత్రానికి ప్రత్యెక ఆకర్షణ గా నిలువనున్నాయి. రాజమౌళి స్వయంగా ఈ చిత్ర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది.